హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) నాలుగో ఎడిషన్‌లో ఆటమ్ చార్జర్స్ టాప్ ప్లేస్లోనే దూసుకెళ్తోంది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లోనూ సూపర్ షో చూపెట్టిన ఆటమ్ టీమ్ ఓవరాల్‌గా 699 పాయింట్లు సాధించింది.
కెప్టెన్ భూషణ్ బైరాగీ, గౌరవ్ అహ్లువాలియా 44 పాయింట్లతో సత్తా చాటగా, మనోజ్ చౌదా, వివేక్ వర్మ 43 పాయింట్లతో అండగా నిలిచారు. జగన్, మనోహర్ కూడా 42 పాయింట్లతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ) నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి. అద్భుతమైన ఫలితాన్ని రాబట్టిన ప్లేయర్లకు టీమ్ ఓనర్ సరోజ గడ్డం అందమైన జిమ్ బ్యాగ్‌లను బహూకరించారు.