టురిన్ (ఇటలీ): ఇండియా వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో వరుసగా రెండో ఓటమిని చవిచూశాడు. బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్‌లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 5–7, 3–6తో మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మ్యాట్ పవిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడారు. దీంతో సెమీస్ చేరే అవకాశాలను క్లిష్టం చేసుకున్నారు.
గంటా 8 నిమిషాల మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ రెండు ఏస్‌లు మాత్రమే కొట్టింది. మూడు డబుల్ ఫాల్ట్స్ చేసింది. నాలుగు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్ని కూడా కాపాడుకోలేదు. తమ సర్వీస్‌లో రెండింటిని కాచుకుంది. నాలుగు ఏస్‌లు, ఒక్క డబుల్ ఫాల్ట్ చేసిన మార్సెలో–పవిచ్ జంట ఆరు బ్రేక్ పాయింట్లలో నాలుగు కాపాడుకుంది. సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 7–6 (10/8)తో ఆండ్రీ రబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు.