సోమశిలను సందర్శించిన ఏటీఆర్​ ఫీల్డ్  డైరెక్టర్

సోమశిలను సందర్శించిన ఏటీఆర్​ ఫీల్డ్  డైరెక్టర్

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్  సోమశిల, అమరగిరి రివర్  ప్రాంతంలో అమ్రాబాద్  టైగర్  రిజర్వ్  ఫీల్డ్  డైరెక్టర్  శివాని డోంగ్రే గురువారం పర్యటించారు. అమరగిరి పర్యాటక ప్రాంతంలోని రివర్ ఏరియాలో కాటేజీలు, వాచ్  టవర్  ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. సోమశిల వద్ద కృష్ణానదిలో బోటులో ప్రయాణించారు. సోమశిల పార్క్ లో అభివృద్ధి పనులు పరిశీలించారు.

డీఎఫ్​వో రోహిత్ గోపిడి, ఎఫ్​డీవోలు తిరుమల రావు, రాంమూర్తి, రామ్మోహన్, సుశాంత్, కొల్లాపూర్  ఎఫ్ఆర్వో చంద్ర శేఖర్, సెక్షన్  ఆఫీసర్​ కాషన్న, ముజీబ్  గోరి, బాయన్న, శివ, జయరాజ్, మంజుల, బీట్  ఆఫీసర్లు నాగార్జున గౌడ్, లక్ష్మయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.