రామాయణ్ జస్ట్ బిగిన్

థియేటర్స్‌‌ తెరుచుకున్నా ఓటీటీలకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికీ పలువురు స్టార్ హీరోల సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజవుతున్నాయి. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ లీడ్ రోల్స్‌‌లో నటించిన ‘అంత్రాంగి రే’ చిత్రం ఓటీటీలో విడుదలవుతోంది. క్రిస్మస్  కానుకగా డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్‌‌‌‌లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా  కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌‌గా  వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షమవడానికి సిద్ధమైంది. రిలీజ్ డేట్‌‌తో పాటు మూవీ ట్రైలర్‌‌‌‌ను కూడా లాంచ్ చేశారు. ఇందులో సారా అలీఖాన్‌‌కు కలల రాకుమారుడిగా అక్షయ్ కనిపిస్తాడు. కానీ ధనుష్‌‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ధనుష్, సారాలు మాసివ్ గెటప్స్‌‌లో కనిపించారు. అసలు కథ ఇప్పుడే మొదలైందనే అర్ధంలో ‘రామాయణ్ జస్ట్ బిగిన్’ అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్‌‌ ఆకట్టుకుంది.