హుజూర్ నగర్లో దారుణం.. రోడ్డు పక్కన నిల్చున్న యువతిపై పెట్రోల్ పోసేశాడు..!

హుజూర్ నగర్లో దారుణం.. రోడ్డు పక్కన నిల్చున్న యువతిపై పెట్రోల్ పోసేశాడు..!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి పక్కనే నిలబడి ఉన్న ఓ యువతిపై యువకుడు పెట్రోల్ పోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముందుగా తాను పెట్రోల్ పోసుకొని, తర్వాత ఆ యువతిపై పెట్రోల్ పోసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే.. అతనిని గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. స్థానికంగా ఉన్న కొందరు గమనించారు కాబట్టి సరిపోయిందని లేకపోతే నిప్పు అంటించి ఉండేవాడని బాధిత యువతి కుటుంబం వాపోయింది. మనుషుల్లో కొందరిలో ఉన్మాదం రోజురోజుకూ పెరిగిపోతుంది. పెట్రోల్ పోసి చంపేసి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

2025 జనవరిలో మేడ్చల్ పీఎస్ ​పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటనలో కూడా నిందితుడు చంపేశాక పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిజామాబాద్ ​జిల్లాకు చెందిన ఇరుగదిండ్ల శివానంద (45)గా చనిపోయిన మహిళను గుర్తించారు. వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె నిందితుడు షేక్ ఇమామ్ కోరిక తీర్చి, మరో రూ.500 ఎక్కువ అడిగినందుకు ఆమెను నిందితుడు దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తేల్చారు.  శివానంద(45) కుటుంబ సభ్యులతో గొడవపడి సిటీకి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ కుషాయిగూడలో నివాసం ఉంటోంది. విటుల దగ్గర డబ్బులు తీసుకుని సెక్స్​వర్క్​చేస్తోంది. 

జనవరి 23, 2025 మధ్యాహ్నం మేడ్చల్ బస్టాప్ వద్ద ఆమె వేచి ఉండగా, శామీర్​పేట మజీద్​పూర్లో ఉంటూ స్టోన్​ కట్టర్గా పనిచేస్తున్న కరీంనగర్​కమలాపూర్కు చెందిన షేక్​ఇమామ్ (37) వచ్చి మాటలు కలిపాడు. తన కోరిక తీర్చితే రూ.500 ఇస్తానని చెప్పడంతో అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఇమామ్​బైక్​పై మునీరాబాద్​ ఓఆర్ఆర్​ కింద కల్వర్ వద్దకు వెళ్లారు. కోరిక తీర్చిన తర్వాత ఆమె మరో రూ.500 అదనంగా అడగడంతో అందుకు షేక్​ఇమామ్​నిరాకరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, ఇమామ్​ఆమెను బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి పెట్రోల్​పోసి నిప్పంటించాడు. మృతురాలి చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ ​చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.