ఇద్దరు మహిళలను మట్టిలో కప్పిపెట్టిన వ్యక్తి అరెస్ట్
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం జరిగింది. తమ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు ఇద్దరు మహిళలపై ట్రక్డ్రైవర్ మొరం కుమ్మరించి, వారిని అందులో పాక్షికంగా పాతిపెట్టాడు. గమనించిన గ్రామస్తులు, ఆ ఇద్దరిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. మంగవాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని హినౌత్ జోరౌట్ గ్రామంలో కొందరు ప్రైవేట్భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే, భూ యజమానులైన మమతా పాండే, ఆశా పాండే దీనిపై నిరసనకు దిగారు. దీంతో ట్రక్డ్రైవర్ వారిపై మొరంమట్టిని కుమ్మరించాడు.
దీంతో వారు సగం వరకు అందులో కూరుకుపోయారు. సమీపంలోని వ్యక్తులు ఇది గమనించి, ఆ ఇద్దరు మహిళలను మొరంలోనుంచి బయటకు తీసుకొచ్చి, దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఒకరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు ఎస్పీ వివేక్సింగ్తెలిపారు. కాగా, రాష్ట్రంలో లా అండ్ఆర్డర్ గాడితప్పిందని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఈ ఘటనపై సీఎం మోహన్యాదవ్ స్పందించారు. పోలీసులు చర్యలు తీసుకున్నారని, ఒకరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మహిళల భద్రతకు తాము ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిపారు.