భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై అత్యాచారం

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై అత్యాచారం

భోపాల్‌‌‌‌:  మధ్యప్రదేశ్‌‌‌‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. కొత్తగా పెళ్లైన యువతిపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డగా.. మరో ఘటనలో మతిస్థిమితం సరిగా లేని మహిళను యువకుడు రేప్ చేశాడు. కొత్తగా పెళ్లయిన​ యువతి తన భర్తతో కలిసి సోమవారం రాత్రి రేవాలోని పిక్నిక్ స్పాట్‌‌‌‌కు వెళ్లగా ఐదుగురు వ్యక్తులు వచ్చి గొడవపడ్డారు. భర్తను చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో  ఇప్పటివరకు దాదాపు వంద మందిని ప్రశ్నించారు.  మరో ఘటనలో..  మతిస్థిమితం లేని మహిళపై ఇండోర్‌‌‌‌లో అత్యాచారం జరిగింది. సోమవారం రాత్రి రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను ఓ యువకుడు  వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళను పెట్రోలింగ్​ పోలీసులు గమనించి హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌ను పరిశీలించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.