- గొడవలు వద్దని చెప్పినందుకు హత్య
- కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
- కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో విషాదం
గోదావరిఖని, వెలుగు: దంపతుల మధ్య గొడవలు వద్దని నచ్చ జెప్పినందుకు వ్యక్తి హత్యకు గురైన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గోదావరి ఖని వినోభానగర్‌కు చెందిన పూజ, మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్ల శ్రావణ్ ఆరేండ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
వీరి మధ్య ఏడాది నుంచి గొడవలు అవుతుండగా పూజ తన పుట్టింటివాళ్లకు తెలిపింది. ఆమె మేనమామ నంది శ్రీనివాస్(38), మరికొందరు వెళ్లి శ్రావణ్ కుటుంబ సభ్యులకు గొడవలు వద్దని నచ్చజెప్పారు.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న శ్రావణ్ గత డిసెంబర్31న గోదావరిఖనికి వచ్చి శ్రీనివాస్‌ను మాట్లాడుదామని బైక్ పై స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వెంట తెచ్చుకున్న కత్తితో శ్రావణ్ పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడు శ్రావణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.