
కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన అధికార బీఆర్ఎస్ నాయకుడు తాత మనోజ్‌పై మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మండలంలోని దమ్మాయిగూడెం గ్రామంలోని ఎవర్ సేస్ స్కూల్ బస్ క్లీనర్‌గా పగిడిపల్లి బాబు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. పొద్దున స్కూల్ బస్సులో పిండిప్రోలు గ్రామంలో చదువుతున్న స్టూడెంట్లను ఎక్కించుకొని వెళ్తుండగా గ్రామంలో ఓ చోట రివర్స్ తీయాల్సి వచ్చింది. క్లీనర్ బాబు దిగి డ్రైవర్‌కు సూచనలు చేస్తుండగా, తాత మనోజ్‌కు చెందిన ట్రాక్టర్ బస్సుకు అడ్డు రావడంతో కొంచెం వెనకకు జరపాలని కోరాడు.
దీంతో తాత మనోజ్ బస్సు క్లీనర్ బాబును కులం పేరుతో దూషిస్తూ తమతో మాట్లాడే దమ్ము ఉందా? అని తన్ని, దాడి చేశాడు. మనోజ్ దాడిని ఖండిస్తూ పిండిప్రోలు గ్రామంలో ఖమ్మం – వరంగల్ హైవే పై దళితులు రాస్తారోకో నిర్వహించారు. మనోజ్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినదించారు. దళిత సంఘం నాయకులు వీరభద్రం, యూనిట్ ఆఫ్ మాల, కేవీపీఎస్ నాయకులతో కలిసి క్లీనర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాతా మనోజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు
నమోదు చేసినట్లు ఎస్ఐ వరాల శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.