నలుగురు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య

  • అమెరికాలో దారుణం

వాషింగ్టన్: అమెరికాలో దారుణం జరిగింది. సెయింట్ లూయిస్ కౌంటీలో ఓ మహిళా ప్రొఫెసర్ తన నలుగురు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. బెర్నాడిన్ బర్డీ ప్రూస్నెర్(39) ఓ కాలేజీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మంగళవారం ఆమె ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో బెర్నాడిన్ సహా ఆమె కూతుర్లు ఎల్లీ(9), ఐవీ (9), జాక్సన్ (6), మిల్లీ (2) చనిపోయారని వివరించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టగా బెర్నాడినే తన పిల్లలను చంపినట్లు తేలిందన్నారు. చిన్నారులు నిద్రిస్తుండగా పరుపుకు బెర్నాడినే నిప్పంటించిందని.. దాంతో వారు సజీవదహనం అయ్యారని తెలిపారు. అనంతరం బెర్నాడిన్ తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనా స్థలంలో బెర్నాడిన్  రాసిన సూసైడ్ నోట్ దొరిగిందన్న అధికారులు..నోట్‌‌లోని విషయాలను మాత్రం బయటపెట్టలేదు. కాగా, 2013లో ఆమె 'మిసౌరీ టీచర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు పొందినట్లు సమాచారం.