కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బాన్సువాడ సమీపంలో ని కెనాల్ లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. తల్లి చిన్నారులను పడేసినట్లుగా స్థానికులు చెబుతుండగా ఆమె మాత్రం ఆటో డ్రైవర్ పడేస్తే తాను కాల్వలో దూకి పిల్లలను కాపాడే ప్రయత్నం చేశానని చెబుతున్నట్టు సమాచారం. వెంటనే కెనాల్ లో పడిపోయిన ఇద్దరు చిన్నారులను బయటకు తీసి హాస్పత్రికి తరలించారు. చిన్నారులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినా..అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా గోళ్ల గుట్ట కు చెందిన అరుణ, మోహన్లకు ఇద్దరు పిల్లలు. వారిలో 8 నెలల చిన్నారి. 4 ఏండ్ల బాబు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.