![ఏపీలో దారుణం..యువతిపై యాసిడి దాడి](https://static.v6velugu.com/uploads/2025/02/atrocity-in-andhra-pradesh--acid-attack-on-young-woman_Q2ui6OAyob.jpg)
వాలెంటైన్స్ డే రోజే ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది.యువతిపై కత్తితో దాడి అనంతరం ముఖంపై యాసిడ్ పోశాడు ఉన్మాది. తీవ్రగాయాలపాలైన యువతి ఆస్పత్రి లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని ప్యారంపల్లికి చెరందిన గౌతమి(23)పై మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ కత్తితో దాడి చేసి తర్వాత ఆమె ముఖంపౌ యాసిడ్ పోశాడు. దీంతో గౌతమికి తీవ్రగాయాలయ్యాయి.
Also Read:-నీ కాళ్లు కడిగి.., ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటా..
గాయాలతో విలవిలాడుతున్న గౌతమిని బంధువులు, స్థానికులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 29న గౌతమికి పెళ్లి జరగనున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.