అత్తాపూర్ లో దారుణం.. వదినను గొంతు నులిమి  చంపిన మరిది 

గండిపేట, వెలుగు: అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు ఆమెను వేధించి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన అత్తాపూర్‌‌‌‌ ఔట్‌‌‌‌ పోస్ట్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పరిధి జలాల్‌‌‌‌ బాబానగర్‌‌‌‌లో ఉండే సయ్యద్‌‌‌‌ అలీకి, కర్ణాటకకు చెందిన షాహీన్​బేగం(27)తో రెండేండ్ల కిందట పెళ్లైంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త అలీ, అత్త షహన్, మరిది సయ్యద్‌‌‌‌ పాషా ఆమెను వేధిస్తున్నారు.

మంగళవారం కొడుకు ఫస్ట్ బర్త్ డే ఉండడంతో షాహీన్‌‌‌‌ బేగం సోమవారం రాత్రి అందుకోసం ఏర్పాట్లు చేసుకుంది. ఇదే సమయంలో భర్త, అత్త, మరిది అదనపు కట్నం కోసం ఆమెతో మరోసారి గొడవకు దిగారు. 6  నెలల కిందటే రూ.లక్ష  ఇచ్చామని, మరింత డబ్బు తమ తల్లిదండ్రులు ఎలా ఇస్తారంటూ షాహీన్‌‌‌‌ వారితో వారించింది. ‘మాకే ఎదురు చెప్తవా’ అంటూ మరిది సయ్యద్‌‌‌‌ పాషా వదినపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత షాహీన్ చనిపోయిందనిఆమె తల్లిదండ్రులకు ఫోన్​లో చెప్పారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు ఫైల్ చేశారు. షాహీన్ తల్లిదండ్రులు అత్తింటి వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లయింట్ చేశారు. మంగళవారం ఉదయం షాహీన్ భర్త అలీ, అత్త షహన్, మరిది షాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తామే హత్య చేసినట్లు వారు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి నిందితులను సాయంత్రం రిమాండ్​కు తరలించారు.