హైదరాబాద్లో దారుణం.. ఘట్​కేసర్​ కల్వర్టు కింద డెడ్​బాడీ

హైదరాబాద్లో దారుణం.. ఘట్​కేసర్​ కల్వర్టు కింద డెడ్​బాడీ

ఘట్​కేసర్, వెలుగు: ఘట్​కేసర్​ పీఎస్​ పరిధిలోని ఓ కల్వర్టు కింద సోమవారం ఓ వ్యక్తి డెడ్​బాడీ లభ్యమైంది. సీఐ పందిరి పరశురాం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా నల్లగొండ జిల్లా చిట్యాల్ మండలం చిన్నకాపరికి చెందిన రూపాని వెంకన్న(49)గా గుర్తించారు. విచారణలో రెండు రోజుల కింద పని మీద శామీర్​పేటకు వచ్చినట్లు తేలింది. కాగా సోమవారం ఘట్​సర్ మున్సిపాలిటీ కొండాపూర్ సమీపంలోని కల్వర్టు వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు.