
కాసర్‌గోడ్: కేరళలో దారుణం చోటుచేసుకుంది. రోజూ తాగివచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడని ఓ మహిళ పక్కషాపు యజమానిపై బిల్డింగ్ఓనర్కు కంప్లైంట్చేయడంతో.. నిందితుడు ఆమెపై థిన్నర్పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఈ నెల 8న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కాసర్‌గోడ్ జిల్లాలోని బేడడుక గ్రామంలో జరిగింది. రమిత (32), రామామృతం అనే ఇద్దరు బేడడుక గ్రామంలో ఒకే బిల్డింగ్లు వేర్వేరు షాపులు నిర్వహిస్తున్నారు.
రమిత కిరాణా దుకాణాన్ని నడుపుతుండగా.. నిందితుడు రామామృతం ఆమె దుకాణం పక్కనే ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే, రామామృతం రోజూ తాగి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని రమిత బిల్డింగ్ఓనర్కు ఫిర్యాదు చేసింది. దీంతో భవన యజమాని షాపు ఖాళీ చేయమని రామామృతాన్ని ఆదేశించాడు. దీంతో రమితపై కోపం పెంచుకున్న రామామృతం.. ఈ నెల 8న రమిత దుకాణంలోకి వచ్చి ఆమెపై థిన్నర్ పోసి నిప్పంటించాడు.
దీంతో ఆమెకు 50 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను కన్నడ్ జిల్లా ఆస్పత్రికి, ఆ తర్వాత మంగళూరులోని ఒక వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె ట్రీట్మెంట్పొందుతూ మంగళవారం మృతిచెందింది. కాగా, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సజితా పురుషోత్తమన్ అనే స్థానిక మహిళ.. రామామృతం బస్సులో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అతన్ని వెంబడించి, ఇతర ప్రయాణికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో స్థానికులు సజితను అభినందించారు.