హైదరాబాద్: దారుణం..చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే బాధితులకు ఠాకూర్ సినిమా చూపించారు. బాధితులను నమ్మించి మోసం చేసి లక్షలు వసూలు చేయాలని చూశారు. ప్రమాదంలో గాయపడిన ఆస్పత్రికి వస్తే.. చికిత్స పేరుతో లక్షలు దండుకోవాలని చూశారు. టెస్టులు చేయాలి.. ఆపరేషన్ చేయాలి.. అంటూ ఐదు రోజులుగా బాధితురాలి కుటుంబానికి చుక్కలు చూపించాురు. చివరికి బాధితురాలు చనిపోయిందంటూ చావు వార్త చల్లగా చెప్పారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో ఈ దారుణ సంఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రవళ్లిక అనే యువతిని ఐదు రోజుల క్రితం కూకట్ పల్లిలోని అమోర్ ఆస్రత్రికి చికిత్సకోసం తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు ప్రవళ్లిక కుటుంబ సభ్యులకు చుక్కలు చూపించారు. మొదట ఆపరేషన్ చేయాలి.. రూ. 3.5 లక్షలు ఖర్చు అవుతందని చెప్పారు.
ఐదు రోజులుగా టెస్టులు, చికిత్స పేరిట ఇప్పటివరకు రూ. 16 లక్షలు వసూలు చేశారు. బుధవారం అర్థరాత్రి ప్రవళ్లిక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.