లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిపై మజ్లీస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో జరిగింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ నిబంధనను విధించింది ఎలక్షన్ కమిషన్. నింబంధనను పట్టించుకోని మజ్లీస్ పార్టీ కార్యకర్తలు బండ్లగూడ రైజింగ్ సన్ స్కూల్ లోని బూత్ నెంబర్ 296 దగ్గరకు 50 మందికి పైగా చేరుకున్నారు. ఒకే దగ్గర గుంపుగా ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఈసా మిశ్రీ…కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న చాంద్రాయణ గుట్ట పోలీసులు…వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కొందరు ఈసా మిశ్రీ, SIపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించి..కేసు నమోదు చేశారు.