- ఆరూరి ప్రచార రథంపై దాడి
- గ్రామస్తులు బైక్‌పై వస్తుండగా రోడ్డుకు అడ్డంగా వాహనం
- హారన్ కొట్టినా తీయలేదని అద్దాలు ధ్వంసం
- ప్రతిదాడి చేసిన బీఆర్ఎస్
- హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఘటన
హసన్‌పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేశ్ ప్రచార రథంపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. గ్రామానికి చెందిన తంగళ్లపల్లి నవీన్, బండ కార్తీక్‌రెడ్డి సోమవారం బైక్‌పై వస్తున్నారు. ప్రచార రథం రోడ్డుకు అడ్డంగా ఉండడంతో హారన్ కొట్టారు.
దీంతో హారన్ ఎందుకు కొడుతున్నారని ప్రచార రథం డ్రైవర్.. నవీన్, కార్తీక్‌లను తిట్టాడు. దీంతో ఆగ్రహంతో వారు రాళ్లతో అద్దాలను పగలగొట్టారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీడర్లు వీరిపై ప్రతిదాడికి దిగారు. గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న హసన్ పర్తి సీఐ గోపి పోలీస్
సిబ్బందితో అక్కడికి వచ్చారు. దాడి చేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు.