బంగ్లాదేశ్ ఆర్మీ స్థావరంపై దాడి: భూ వివాదం నేషనల్ ఇష్యూగా మారింది..!

బంగ్లాదేశ్ ఆర్మీ స్థావరంపై దాడి: భూ వివాదం నేషనల్ ఇష్యూగా మారింది..!

బంగ్లాదేశ్‌, కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక దళ స్థావరంపై సోమవారం(ఫిబ్రవరి 23) దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు.

అసలేం జరిగిందంటే..?

సోమవారం ఉదయం భూ వివాదంపై బంగ్లాదేశ్ వైమానిక దళ సిబ్బందికి, స్థానిక నివాసితులకు మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో ఆ వివాదం హింసాత్మకంగా మారింది. కాక్స్ బజార్ వైమానిక దళ స్థావరానికి ఆనుకుని ఉన్న సమతి పారాకు చెందిన కొంతమంది దుండగలు.. వైమానిక దళ స్థావరంపై దాడి చేశారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన చేసింది.

ALSO READ : బుల్లెట్ లేడీ నిఖిల అరెస్ట్ : సోషల్ మీడియా పాపులారిటీతో డ్రగ్స్ అమ్మకం

మృతుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌గా గుర్తించారు. అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. వైమానిక దళ సిబ్బంది జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికులు వైమానిక దళ స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయని నివేదికలు చెప్తున్నాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో భద్రతా సిబ్బంది స్థానికులపై కాల్పులు జరుపుతున్నట్లు ఉంది.

ఘర్షణకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ సలావుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.