ఆళ్లపల్లి, వెలుగు: ఆళ్లపల్లి మండల కేంద్రంలోని మర్కోడులో కొందరు యువకులు మద్యం మత్తులో డీసీసీబీ ఆఫీపర్లపై దాడిచేశారు. బుధవారం రుణాల రికవరీ కోసం బోడాయకుంటకు వెళ్లిన అసిస్టెంట్ మేనేజర్ సుమన్, స్టాఫ్శోభన్, డ్రైవర్ వసీంను కొమరం రామ, లక్ష్మణ్, జోగ సాగర్ అనే ముగ్గురు పెద్దూరు సమీపంలో వెంబడించారు.
మర్కోడు సమీపంలో అడ్డుకున్నారు. శోభన్ ను కొట్టి ఫోన్లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకున్న బ్యాంక్అధికారులు స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. సదరు యువకులు మర్కోడుకు చెందిన గడ్డం నరేందర్ పై కూడా దాడిచేసినట్లు తెలిసింది. ఎస్సై రతీశ్కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.