వరంగల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడి.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన

ఢిల్లీ: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్.. త‌మ పార్టీ కార్యకర్తల పై దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీ లు అర్వింద్, బాపురావు అన్నారు. త‌మ నాయకులపై, పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. వ‌రంగ‌ల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేప‌డ‌తామ‌ని చెప్పారు.

రామ మందిరము కట్టడం ఇష్టం ఉందా లేదా ?

ముఖ్యమంత్రి కేసీఆర్ నాస్తికుడని అన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్ . ముస్లిం, క్రిస్టియన్ గుడులకు పైసలు ఇస్తున్నాడు తప్ప హిందూ దేవాలయాలకు ఎక్కడ ఇవ్వటం లేదని అన్నారు. ఆయన యాగాలు చేస్తాడు, భక్తుడు అంటాడు, తానో పెద్ద హిందువు అంటాడు, మరి శ్రీ రాముడి గుడిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు అర్వింద్. అస‌లు కేసీఆర్ కి రామమందిరము కట్టడం ఇష్టం ఉందా లేదా చెప్పాలని అన్నారు.

శ్రీరాముని ట్రస్టు ద్వారానే తాము చందాలు తీసుకుంటున్నామ‌ని , శ్రీ రాముడి భక్తుడిగా, హిందువుగా చందాలు అడుగుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు.