తమ్ముడి భార్యపై గొడ్డలితో అటాక్​

కొడిమ్యాల : భూతగాదాలతో తమ్ముడి భార్యపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ కు చెందిన నీలగిరి రవీందర్ రావు, సత్యం రావు అన్నదమ్ములు. కొన్నేండ్ల కింద సత్యం రావు చనిపోగా, ఇతడి భార్య భార్య లత, అన్న రవీందర్ రావు మధ్య భూతగాదాలు మొదలయ్యాయి.

శుక్రవారం పొలం వద్ద జరిగిన గొడవలో రవీందర్ రావు, ఇతడి కొడుకు రామేశ్వర్​రావు కలిసి లతపై గొడ్డలితో దాడి చేశారు. ఆమె తీవ్రంగా గాయపడగా జగిత్యాల ఏరియా హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్ల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకువెళ్లారు. లత కొండగట్టు టెంపుల్​లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.