- ఈవీఎంలు మారుస్తున్నారనే అనుమానంతో గ్రామస్తుల అటాక్
- తుంగతుర్తి సమీపంలో ఘటన
తుంగతుర్తి, వెలుగు : ఈవీఎంలను మారుస్తు న్నారనే అనుమానంతో తుంగతుర్తిలోని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసు సమీపంలో సెక్టార్ ఆఫీసర్ వాహనాన్ని గ్రామస్తులు ధ్వంసం చేశారు. సెక్టార్ పరిధిలోని రూట్ ఆఫీసర్గణేశ్ నాగారం మండలంలోని లక్ష్మీపురం 29వ నెంబర్ బూత్ కు సంబంధించిన కొన్ని రిజర్వ్ ఈవీఎంలను బస్సులో ఎక్కించాడు. ఒక ఈవీఎంను తనతో పాటు తీసుకుని కారులో తుంగతుర్తి బయలుదేరాడు. వెంట పోలీస్ కాన్వాయ్ లేకపోవడంతో ఈవీఎంలను మారుస్తున్నారనే అనుమానంతో లక్ష్మీపురం గ్రామస్తులు వెంబడించారు. తుంగతుర్తి సమీపంలో అడ్డగించి దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో సెక్టోరియల్ఆఫీసర్ గణేశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్వో వెంకట్ రెడ్డి తెలిపారు.
చెరువులో పల్టీ కొట్టిన అబ్జర్వర్ వెహికల్
నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో ఎన్నికల అబ్జర్వర్ టీం వెహికల్పల్టీ కొట్టింది. శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఎండబెట్ల నుంచి నాగర్ కర్నూల్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. వెహికల్లో డ్రైవర్ మధు ఒక్కడే అందులో ఉన్నాడు. ఎండబెట్ల వద్ద ఉన్న బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.