- తృటిలో తప్పిన ప్రమాదం
- బేజేపి పనేనన్న కాంగ్రెస్
లక్నో: జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది. లక్నోలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కన్హయ్య కుమార్ పై దేవాన్ష్ బాజ్పాయ్ అనే స్థానిక యువకుడు యాసిడ్ తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సభలో మాట్లాడేందుకు కన్హయ్య కుమార్ వేదిక మీదకి రాగానే నిందితుడు అతడిపై యాసిడ్ చల్లేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆ యువకున్ని అడ్డుకున్నారని, దీంతో కన్హయ్య కుమార్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక బీజేపి కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ హైకోర్టుకు 12మంది కొత్త జడ్జిలు
ముందస్తు ఎన్నికలంటూ అసత్య ప్రచారాలు