- ఒకరి మృతి.. నలుగురికి గాయాలు
- గోవులతో వెళ్తున్న వెహికల్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన గోరక్షకులు
- ఏడుగురిని కత్తులతో పొడిచిన 14 మంది దుండగులు
కుభీర్, వెలుగు: గోవులతో వెళ్తున్న వెహికల్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన గోరక్షకులపై దుండగులు దాడి చేశారు. ఏడుగురిపై 14 మంది దుండగులు కత్తులతో దాడి చేసి, ఒకరిని చంపేశారు. మరో నలుగురు గాయపడ్డారు. మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలైన శివుని, అప్పరావుపేట్ వద్ద సోమవారం రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. గ్రామాల సరిహద్దుల్లో బొలెరో వెహికల్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న గోరక్షక్ సమితి సభ్యులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గోరక్షక్ సభ్యుల్లో ఏడుగురిపై గోవులను అక్రమంగా తరలిస్తున్న 14 మంది కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో శేఖర్(27) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం నాందేడ్ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.