జగిత్యాలలో దారుణం: తండ్రి, కొడుకులపై కత్తితో దాడి తీవ్ర గాయాలు..

జగిత్యాలలో దారుణం జరిగింది.. జిల్లాలోని ధర్మపురి మండలం రాయపట్నంలో ఓ రౌడీ షీటర్ ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆదివారం ( జనవరి 12, 2025 ) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. సత్తయ్య, రాకేష్ అనే తండ్రి, కొడుకులపై శ్రీనివాస్ అనే ర్ వ్యక్తి కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ వ్యక్తి రౌడీ షీటర్ అని తెలుస్తోంది.

ఈ దాడిలో సత్తయ్య, రాకేష్ లకు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా రాయపట్నంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడు రాకేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు  తెలుస్తోంది.మద్యం మత్తులో శ్రీనివాస్ తమపై దాడికి పాల్పడ్డటు తెలిపారు బాధితులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.