భూతగాదాలతో తండ్రిపై దాడి.. అది చూసి షాక్ తో కూతురు మృతి

అనుకోని ఘటన.. తగాదాలతో తండ్రి పై ప్రత్యర్థుల దాడి.. ఒకేసారి ముగ్గురు దుండగులు తండ్రిపై పడి  కర్రలు, రాళ్లతో కొడుతుంటే.. ఆ పసి హృదయం తట్టుకోలేకపోయింది.. నాన్నా నాన్నా.. అంటూ బోరున ఏడ్చింది.. అయినా ఆ కసాయిలు తండ్రిని వదలకుండా కొడుతుంటే.. గుండెలు పగిలేలా ఏడ్చి కుప్పకూలింది.. తండ్రిపై దాడిని తట్టుకోలేక 14యేళ్ల బాలిక ప్రాణాలొదిన ఘటన సూర్యాపేటలో జిల్లాలో జరిగింది. 

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భూతగాదాలతో తండ్రిపై కొందరు వ్యక్తులు చేయగా.. ఆ దృశ్యాలను చూసిన కూతురు షాక్ తో స్పాట్ లోనే చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి. కొత్తపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

డి. కొత్త పల్లికి చెందిన కాసం సోమయ్యకు కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగం కు మధ్య గత కొంత కాలంగా భూతగాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆగస్టు16, 2024 వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. కాసం సోమయ్య పై నిందితులు ముగ్గురు కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తండ్రిపై రాళ్లు, కర్రలతో ఓకేసారి ముగ్గురు నిందితులు దాడి చేయడంతో ఆ ఘటన చూసిన కాసం సోమయ్య కూతురు కాసం పావని (14) షాక్ కు గురై స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందింది. పావని మృతదేహంపై పడి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదించడం పలువురిని కంటతడి పెట్టించాయి. 

దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి  చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కాసం సోమయ్యపై దాడి చేసిన ముగ్గురు నిందితులు కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగం లపై కే సు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పావనీ మృతదేహాన్ని పోస్ట్  మార్టమ్ కు తరలించారు.