పెద్దపల్లి జిల్లాలో గవర్నమెంట్ ప్రభుత్వాస్పత్రి డాక్టర్పై కొందరు దుండగులు దాడి చేశారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ మహేందర్ పై గుర్తు తెలియ ని వ్యక్తులు మంగళవారం జూలై 30,2024 న దాడి చేశారు.
ఆస్పత్రిలో విధులు ముగించుకొని కారులో వెళ్తుండగా.. బూరుగుపల్లి సమీపంలోకి రాగానే.. కారులో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు.. డాక్టర్ మహేందర్ పై ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. దీంతో మహేందర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం డాక్టర్ ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.