హుక్కా సెంటర్‎పై దాడి.. 9 మంది అరెస్ట్

హుక్కా సెంటర్‎పై దాడి.. 9 మంది అరెస్ట్

బడంగ్ పేట, వెలుగు: బాలాపూర్​పరిధిలో హుక్కా సెంటర్ పై దాడి చేసి, 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ కాలనీకి చెందిన అహ్మద్ బవాజీర్ గుట్టుచప్పుడు కాకుండా కొద్దికాలంగా హుక్కా సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో ఈ సెంటర్​పై బుధవారం ఉదయం ఎస్ఓటీ, స్థానిక పోలీసుల కలిసి దాడి చేశాడు. నిర్వాహుడితోపాటు హుక్కా తాగుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. హుక్కా పాట్స్​ను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.