పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన భార్య
జీడిమెట్ల, వెలుగు: భర్తపై భార్య దాడి చేసిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. హుస్నాబాద్‌కి చెందిన సదయ్య జగద్గిరిగుట్టలోని దీనబంధుకాలనీలో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఇటీవల మతిస్థిమితం తప్పడంతో కుటుంబీకులు ట్రీట్‌మెంట్ చేయించగా కోలుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత నుంచి సదయ్య భార్య రజిత అతడితో గొడవపడటం మొదలుపెట్టింది. మంగళవారం సాయంత్రం రజిత భర్త సదయ్యపై వేడి ఆయిల్ పోసింది. తర్వాత అతడిపై కారం చల్లింది. పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. స్థానికులు గాయపడ్డ సదయ్యను హాస్పిటల్‌కి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
For More News..