నిర్మల్ జిల్లా బైంసాలో కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్ దీక్షాపరులు కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. కేటీఆర్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా అడ్డుకుని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీరాముని జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేశారు.
వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు.. జై తెలంగాణ అంటూ పోటాపోటీగా నినదించారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు మధ్య తోపులాట జరిగింది.