హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం.. రెండు చేతులు బ్లేడ్ తో కోసిన దుండగులు..

హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం.. రెండు చేతులు బ్లేడ్ తో కోసిన దుండగులు..

హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హైదరాబాద్ లోని చైతన్య పురిలో చోటు చేసుకుంది ఈ ఘటన. శుక్రవారం ( జనవరి 24, 2025 ) ఉదయం బాలిక కాలేజీకి వెళ్తుండగా బాలికపై దాడి చేశారు దుండగులు. బ్లేడ్ తో దాడి చేయటంతో బాలిక రెండు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. హత్యాయత్నం చేసిన దుండగులను నెట్టేసిన బాలిక దగ్గర్లో ఉన్న కాలేజీకి వెళ్లి తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించింది.

బాలిక ఇచ్చిన సమాచారంతో తండ్రి చైతన్యపురి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు, తండ్రి ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై దాడి చేసిన దుండగులు ఎవరు, దాడికి గల కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

ALSO READ | అనంతపురం: నేషనల్ హైవేకు దగ్గరగా భారీ చోరీ.. రూ. 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు.. నగదు దోపిడి