పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి జరిగింది.  నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తున్న తన కాన్వాయ్ కు  బీజేపీ కార్యకర్తలు సైడ్ ఇవ్వలేదని స్రవంతి ఆరోపించారు. ఈనేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి, తన కాన్వాయ్ లోని ఒక కారుపై  బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు.    

తమ కారు డ్రైవర్ పై చేయి చేసుకుని  ఇబ్బంది పెట్టారని స్రవంతి ఆరోపించారు. ఈ ఘటన పై జిల్లా ఎస్పీకి స్రవంతి ఫిర్యాదు చేశారు.  ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్  చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే  ధర్నా చేస్తామన్నారు. ప్రజాస్వామికంగా ప్రజలు ఇచ్చే తీర్పును కోరుకుందాం కానీ  ఇలాంటి చర్యలు సరైనవి కావని స్రవంతి అన్నారు.