యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై జరిగిన దాడిలో బీఆర్ఎస్ కు గానీ, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని వరంగల్ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ చెప్పారు. ఛత్రపతి శివాజీపై పవన్ పెట్టిన తప్పుడు పోస్టింగ్స్ వల్ల జరిగిన ఘర్షణను బీఆర్ఎస్ పై రుద్దుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు కారని, నికార్సయిన ఉద్యమకారులని, వినయ్ బాస్కర్ లాంటి వారిపై చిల్లర మాటలు మాట్లాడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.... చిల్లర ఆరోపణలు మానుకోవాలంటూ ఆయన హెచ్చరించారు.
పచ్చటి తెలంగాణను విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తే సహించేది లేదని సుందర్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళల్లో వాళ్లే కొట్టుకొని తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. గ్రూప్ వార్ లో తన్నుకొని బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వినయ్ బాస్కర్ వరంగల్ పశ్చిమలో ఐదోసారి గెలవడం ఖాయమని విశ్యాసం వ్యక్తం చేశారు. పవన్ పై దాడికి బీఆర్ఎస్ కు- గానీ, ఎమ్మెల్యేకు గానీ ఎలాంటి సంబంధం లేదని మరోసారి ముక్తకంఠంతో స్పష్టం చేశారు.