శంషాబాద్‌లో దేవాలయంపై దాడి.. అమ్మవారి విగ్రహం ధ్వంసం

హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే శంషాబాద్ లో హనుమాన్ దేవాలయంలోని నవగ్రహలను ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకోగా..  నవంబర్ 9(శనివారం) శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో మరో దేవాలయంపై దుండగులు దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు హిందూ దేవాలయంపై దాడి చేశారు. అమ్మవారి విగ్రహానికి ఉన్న వస్త్రాలు, కళ్లు తొలగించారు దుండగులు. గ్రామంలోని సోమయ్య చౌడమ్మ పోచమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ద్వంసం చేశారు. రాత్రి వేళ కావడంతో ఆలస్యంగా గ్రామస్తులు గుర్తించగా.. 9మంది పరార్ అయ్యారు. గ్రామస్థులతోపాటు పోలీసులు కూడా దేవాలయం దగ్గరకి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిలో ఒకడిని  స్థానికులు పట్టుకున్నారు. గ్రామస్థులు పట్టుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.