తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్పై దాడి

తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్పై దాడి

వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాంతో ఆ అరెస్టుకు వ్యతిరేకంగా పంజాబ్ లోని అమృత్ సర్ లో వందలాది మంది వారిస్ గ్రూప్ నిరసనకారులు పోలీస్ లతో ఘర్షనకు దిగారు. కత్తులు, తుపాకులు పట్టుకొని పెద్ద డీజే బాక్సులతో అడ్డుగా ఉంచిన బారీకేడ్లను తొలగించుకుంటూ బలప్రదర్శనను నిర్వహించారు. రాజకీయ దురుద్దేశంతోనే లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారని అమృత్‌పాల్ సింగ్ ఆరోపించాడు. గంటలో కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని అమృత్‌పాల్ సింగ్ హెచ్చరించాడు. అరెస్టు విషయంలో పోలీసులు, అధికారులు ఏమి చేయలేమని చెప్పడంతోనే బల ప్రదర్శనకు దిగినట్లు చెప్పాడు. 

వారిస్ పంజాబ్ దే గ్రూప్ చర్యలవల్ల అజ్నాలా పోలీస్ స్టేషన్లో భారీగా పోలీసులను మోహరించారు. బారీకేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయినా, అజ్నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్‌ను దాటి వెళ్లారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను బలవంతంగా తొలగించి ముందుకు వెళ్లారు.