ఆదిలాబాద్ లో దారుణం: వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు

ఆదిలాబాద్: వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి చంపిన ఘటన సోమవారం ఆదిలాబాద్ లో జరిగింది. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అమల్‌ పై ఆదిలాబాద్ బస్టాండ్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు అరుస్తూ ఘటన స్థలికి చేరుకునేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని స్థానికులు పక్కనే ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందనీ.. వెంటనే హైదరాబాద్ హాస్పిటల్‌కు తరలించాలని సూచించారు.

వారి సూచన మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కి తరలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది. పట్టపగలే వ్యక్తిపై దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేపింది.