హైదరాబాద్: అన్నం వండలేదని రూమ్‌మెట్‌పై దాడి చేయగా.. దాడిలో బాధితుడు అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఏప్రిల్ 2న చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజస్థాన్‌కు చెందిన హన్స్‌రామ్(38)గా గుర్తించారు. హన్స్‌రామ్ తన భార్యతో గతంలో కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. తరచూ తాగి వచ్చి భార్యను వేధించేవాడు. కొన్నిరోజులకు భార్య పుట్టింటికి వెళ్లింది. హన్స్‌రామ్ ఇల్లు ఖాళీ చేసి జీడిమెట్లలోని తన ఫ్రెండ్ బినయ్ సింగ్ రూంలోకి వచ్చాడు. బినయ్ సింగ్ స్థానికంగా ఓ గ్రానైట్ వ్యాపారి దగ్గర జాబ్ చేస్తూ.. బీహార్‌కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్ లతో అద్దెగదిలో ఉంటున్నాడు.
మంగళవారం (ఏప్రిల్ 2)న పని నుంచి ఇంటికి వచ్చిన సోనూ తివారీ, సందీప్ కుమార్ వచ్చే సరికి అన్నం వండలేదని బినయ్ సింగ్, హన్స్‌రామ్ పై మద్యం మత్తులో దాడి చేశారు. హన్స్‌రామ్ ని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బినయ్ సింగ్ తన యజమానికి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.