బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్. ఆయన ఇంట్లోకి బయట వ్యక్తులు వెళ్లినట్లు.. ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు సీసీకెమెరాల్లో లేదని తేల్చేశారు పోలీసులు. ఎవరూ ఇంట్లోకి వెళ్లినట్లు ఎక్కడా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ కాలేదు.. ఫుటేజ్ అంతా క్లియర్ గా ఉందని వెల్లడించారు. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకున్నది. బయటవాళ్లు కానప్పుడు.. అది ఇంట్లో వాళ్లు చేసిన పనే అనేది స్పష్టం అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్లే సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచినట్లు ఓ నిర్థారణకు వస్తున్నారు పోలీసులు. ఇది అంతర్గత కుట్ర కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లో జరిగిన దాడి.. ఆయన ఒంటిపై ఆరు కత్తిపోట్లకు సంబంధించిన అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. సీసీకెమెరాల్లో ఎవరూ ఆయన ఇంట్లోకి వెళ్లలేదు అని నిర్థారణకు రావటంతో.. ఇంట్లో పని చేసే వారిని విచారిస్తున్నారు పోలీసులు. సైఫ్ అలీఖాన్ అపార్ట్ మెంట్ ప్లాట్ లో ఎంత మంది ఉంటున్నారు.. ఎవరెవరు పని చేస్తున్నారు.. వాళ్ల వివరాలు ఏంటీ.. ఎక్కడి వారు.. ఎన్నాళ్లుగా పని చేస్తున్నారు.. వాళ్లను నియమించింది ఎవరు.. ఏ ప్రాంతం వారు.. ఇలాంటి అన్ని విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read : సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరు కత్తి పోట్లు
సైఫ్ అలీఖాన్ ఇంట్లోని వారే అతనిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఆ దిశగా విచారణను స్పీడప్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీఖాన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అతని భార్య, నటి కరీనాకపూర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకుంటున్నారు. అపార్ట్ మెంట్ సెక్యూరిటీ సిబ్బంది నుంచి వివరాలు సేకరించటంతోపాటు.. అక్కడ రికార్డ్ అయిన మొత్తం సీసీఫుటేజ్ ను సీజ్ చేశారు పోలీసులు.