సిద్దిపేటలో హైటెన్షన్.. అర్థరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి..

సిద్దిపేటలో హైటెన్షన్..  అర్థరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి..

సిద్దిపేటలో అర్థరాత్రి హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు. తాళాలు పగలగొట్టి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్పందించిన హరీశ్ రావు కాంగ్రెస్ గుండాలు ఈ దాడి చేశారని ఆరోపించారు.ఈ దాడిలో క్యాంప్‌ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలను చించేశారు.

దాడి చేసేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు… జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రావడంతో హరీష్‌ ఆఫీస్‌ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను బయటకు పంపించేశారు.

ఈ క్రమంలో  కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు హరీష్ రావు. అర్ధరాత్రి దాడి చేయడాన్ని చూస్తే తీవ్ర ఆందోళనలను రేకెతుస్తోందని ఎక్స్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇలా దాడి చేస్తే సామాన్యలు భద్రతకు ప్రభుత్వం ఏం భరోసా ఉంటుందని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.