- తునికాకు బోనస్ పంపిణీలో అవకతవకలు
- రూ.10 లక్షలు దారి మళ్లించారని నిర్ధారణ
వికారాబాద్, వెలుగు: తునికాకు సేకరణ కార్మికులకు బోనస్చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన తాండూరు, వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా అటవీ ప్రాంతం పరిధిలో ఏటా కార్మికులు తునికాకు సేకరిస్తుంటారు. 2017లో తునికాకును సేకరించినవారికి ప్రభుత్వం కూలీ పైసలు వేసింది. తాజాగా 2017కు సంబంధించిన తునికాకు బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జిల్లాలోని ఎఫ్ఆర్ఓలు బోనస్పైసల్లోని రూ.10 లక్షలను పక్క దారి మళ్లించినట్లు ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో రూ.7.5 లక్షలు, తాండూరు రేంజ్ పరిధిలో రూ.2.5 లక్షలు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పిసిసిఎఫ్ ) డోబ్రియల్ వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్అరుణ, తాండూరు రేంజ్ ఆఫీసర్శ్యాంసుందర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలను జారీ చేశారు. ఇద్దరు ఎఫ్ఆర్ఓలను ఒకేసారి సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.