- చీటూర్లో నిర్వాహకుడిపై కేసు నమోదు, అల్లోపతి మందులు స్వాధీనం
జనగామ అర్బన్, వెలుగు : అనుమతులు లేని మెడికల్ షాప్ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వరంగల్ డ్రగ్కంట్రోల్శాఖ అసిస్టెంట్డైరెక్టర్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె పర్యవేక్షణలో జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం చీటూర్ లో అనుమతులు లేని మెడికల్ షాప్‌పై డ్రగ్ ఇన్స్పెక్టర్లు జనగామ బాలకృష్ణ, వరంగల్ అరవింద్ కుమార్ ఆకస్మిక దాడులు నిర్వహించి 49 రకాల అల్లోపతి మందులను స్వాధీనపర్చుకున్నారు.
మెడికల్‌షాప్ నిర్వాహకుడు కె.రాకేశ్‌కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జనగామ కోర్టు లో ఇంటిమేట్ చేసి, మందులను అప్పగించారు. ఘనపూర్‌లో నిర్వహించిన దాడుల్లో నిబంధనలు ఉల్లంగించిన 5 మెడికల్ షాపులకు నోటీసులు జారీచేశారు. ఈ దాడుల్లో జయశంకర్ భూపాలపల్లి డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.పావని, వరంగల్, జనగామ జిల్లా అధికారులు పాల్గొన్నారు.