
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 133 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ పూర్తిగా కాలిపోయి రోడ్డుపై పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. మహిళను ఆస్పత్రికి తరలించారు. అయితే తన భర్తే తనను తగలబెట్టాడని బాధితురాలు అంటుంది. భర్త తగులబెట్టాడా? లేక తానే తగులబెట్టుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను అత్తాపూర్ వాసి శివానీగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.