లక్ష్మణచాంద, వెలుగు: తమ్ముడి పై అన్న దాడి చేశాడు. ఈ ఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం చిలారి పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య అనే అన్నదమ్ముల మధ్య భూతగాదాలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనేకసార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. శుక్రవారం ఉదయం భూమి విషయమై వారి మధ్య గొడవ జరిగింది. అన్న చిలారి పెద్ద మల్లయ్య తన కొడుకు మహేశ్తో కలసి తమ్ముడి చిలారి చిన్న మల్లయ్య(40) మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయాపర్చారు.
ఆనంతరం ఏమీ తెలియనట్లు పెద్ద మల్లయ్య పీఎస్కు వెళ్లి తన తమ్ముడు తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. తరువాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. పోలీసులు గ్రామానికి వెళ్లి తీవ్రగాయాలతో పడివున్న చిన్న మల్లయ్యను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారన్నారు. చిన్న మల్లయ్య కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. బాధితుడి భార్య గంగవ్వ పిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.