వరంగల్ లో దంపతులపై కత్తులతో దాడి

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వరంగల్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న దంపతులపై దాడి జరిగింది. అంబటి వెంకన్న , అతని భార్య నడుచుకుంటూ వెళుతుండగా. ఒక్కసారిగా వచ్చిన దుండగులు మొదట వారి కళ్లలో కారం కొట్టారు. తర్వాత తలపై రాడ్డుతో దాడి చేశారు. వెంకన్నను కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెంకన్నకు.. కుమ్మరికుంటలో ఉన్న దాదాపు 3 కోట్ల విలువ చేసే భూమిపై కొందరితో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంకన్న దంపతులపై దాడి చేసిన దుండగులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.