పబ్జీ ఆడుతుండగా కత్తులతో దాడి

పబ్జీ ఆడుతుండగా కత్తులతో దాడి

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: తన ఇంటి ముందు పబ్జీ ఆడుతున్న ఓ యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ శనివారం రాత్రి జరిగింది. బాధితుడు మహమ్మద్ దానిశ్​ తెలిపిన వివరాల ప్రకారం అతడు తన ఇంటి ముందు కూర్చొని సెల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, మారణాయుధాలతో దాడులు చేసినట్లు బాధితుడు తెలిపాడు. గాయల పాలైన బాధితుడి దానిశ్​గవర్నమెంట్ ​హాస్పిటల్ లో ట్రీట్​మెంట్​ పొందుతున్నాడు. ఆరో టౌన్  పోలీసులకు కంప్లైంట్​చేసినా పట్టించుకోవడం లేదన్నాడు. తనను  చంపుతామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని దానిశ్​వాపోయాడు.