నిజామాబాద్ క్రైమ్, వెలుగు : అటవీ శాఖ అధికారులపై దాడిని ఖండిస్తూ నిరసనగా శనివారం అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మోపాల్ మండలంలో విధుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీ శాఖ ఎస్ఆర్ఓ రవి మోహన్ బట్, జేఆర్ఓ నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్ రావు అన్నారు.
కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు, సిబ్బందికి ఆయుధాలు సమకూర్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అటవీ అధికారులు పద్మారావు సిబ్బంది పాల్గొన్నారు.