భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలపల్లి సమీపంలోని కొండపల్లి సరిత, కొండపల్లి మనీలా భూములపై అధికారులు దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
నిన్న రాత్రి ఫిబ్రవరి 06 సర్వే పేరుతో అధికారులు కొండపల్లి భూముల మీదికి వెళ్ళి క్రమంలో కొండపల్లి కుటుంబం అడ్డుకున్నది. దీంతో ఆందోళన తీవ్రతరం కావడంతో ఫారెస్ట్ అధికారులు వెనుతిరిగారు. ఈరోజు ఫిబ్రవరి 07 ఉదయాన్నే పోలీస్ ఫోర్స్ తో భూమిలో నిర్మాణం చేసి ఉన్న కోళ్ల ఫారంపై దాడులు ప్రారంభించారు. పొలంపల్లి సమీపంలోని 549 సర్వే నంబర్ గల భూమిలో ఉన్న ఇరువై ఎకరాల భూమిలో ఫారెస్ట్ పరిధిలో ఉందని ఫారెస్ట్ అధికారులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది.
స్థలంలో నిర్మాణం అయి ఉన్న దాన్ని మొత్తం జేసీబీతో పోలీస్ ఫోర్స్ తో కొండపల్లి సరిత, మనీలా భూమిలో నాటిన మామిడి తోటను ధ్వంసం చేశారు. తమకు హక్కు పత్రాలు ఉన్న అన్యాయంగా తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారని కొండపల్లి కుటుంబం ఆరోపిస్తుంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అవిశ్వాస తీర్మానంలో కొండపల్లి సరిత భర్త గణేష్ కీలక పాత్ర పోషించి.. కాంగ్రెస్ పార్టీ నేతలను మంత్రులను ముప్పు తిప్పలు పెట్టిన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై క్షపూరిత చర్యలకు పాల్పడుతుందని కొండపల్లి కుటుంబం ఆరోపించింది.
ALSO READ: అడవుల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచాలి