నెన్నెల మండలంలోని గుడుంబా స్థావరాలపై దాడులు

నెన్నెల మండలంలోని గుడుంబా స్థావరాలపై దాడులు
  • వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
     

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామ శివారులో గుడుంబా స్థావరంపై టాస్క్​పోర్స్​పోలీసులు శనివారం దాడులు చేసి భారీగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. టాస్క్​పోర్స్​ ఎస్​ఐ లచ్చన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుడుంబా తయారు చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆవుడం శివారులో స్థావరంపై దాడి చేసి వెయ్యి లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 11 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారు చేస్తున్న ముప్పిడి శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు.