ఎడపల్లి, వెలుగు : సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ సంఘటనను నిరసిస్తూ సికింద్రాబాద్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నహిందువులపై జరిగిన లాఠీచార్జిని బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్, హిందూ వాహిని నాయకులు ఖండించారు. సోమవారం బంద్కు పిలుపు ఇవ్వడంతో వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్ లో భాగంగా సంఘ విద్రోహ శక్తుల దిష్టి బొమ్మను నాయకులు దహనం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు కందగట్ల రాంచందర్ మాట్లాడుతూ..
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి జీవిత ఖైదు శిక్ష విధించాలన్నారు. దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లెపూల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులునాయిని లక్ష్మణ్ గౌడ్, శివచైతన్య, బూత్ అధ్యక్షులు దేవర్ల నవీన్, కట్కం సుధాకర్, వీరేందర్, ద్యాకం సాయిరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సాయి, నాయకులు ప్యాట గంగాధర్, కంజరి ప్రదీప్, అనిరుధ్ గౌడ్, హిందూ వాహిని జిల్లా కార్యదర్శి మీసాల రఘు పాల్గొన్నారు.
భిక్కనూరు, వెలుగు : హైదారాబాద్, సికింద్రబాద్లలో హిందువులు, ఆలయాలపై జరుగుతున్న దాడులను బజరంగ్దళ్నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల బజరంగ్దళ్సభ్యులు గంటపాటు ధర్నా నిర్వహించారు. బజరంగ్దళ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. ధర్నాలో మండల బజరంగ్దళ్సభ్యులు పాల్గొన్నారు.